31ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న.. వాంటెడ్ అరెస్ట్

31ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న.. వాంటెడ్ అరెస్ట్

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని నలసోపరాలో 31 ఏళ్ల తర్వాత.. ఓ హత్య కేసులో వాంటెడ్ గా ఉన్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న దీపక్ భిసే అనే వ్యక్తి 1989లో రాజు చిక్నా అనే వ్యక్తిని చంపాడు. ధర్మేంద్ర సరోజ్‌ అనే మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనికి 1992లో బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత నుంచి అతను కేసు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరగడంతో.. 2003లో అతడు పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది.

కాండివాలి సబర్బన్‌లోని తులస్కర్‌వాడి వద్ద ఉన్న భిసేలోని దీపక్ భిసే నివాసానికి పోలీసులు వెళ్లి తనిఖీ నిర్వహించారు. కానీ అక్కడి స్థానికులు అతను చనిపోయి ఉండవచ్చని చెప్పడంతో పోలీసులు అక్కడ్నుంచి వెనుదిరగవల్సి వచ్చింది. కానీ అతని కోసం ఇంకా వెతకడం కొనసాగించామని పోలీసులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన పోలీసుల సోదాల్లో నిందితుడి భార్య మొబైల్ నంబర్‌ను పోలీసులు ట్రాక్ చేయడంతో అతన్ని వారు కనిపెట్టగలిగారు.

నలసోపరాలో అతను తన కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడని, చెట్లను నరికివేసే కాంట్రాక్టు పని చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సు ఉన్న నిందితుడిని అరెస్టు చేశారమని, తదుపరి విచారణ కొనసాగుతోందని కండివాలి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ నితిన్ సతమ్ తెలిపారు.