
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. కాంగ్రెస్ కూటమి మధ్య సీట్ల లెక్క కొలిక్కి వచ్చింది. ఉద్దవ్ థాక్రే ఆధ్వర్యంలో ఉద్దవ్ సేన 21 సీట్లలో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి రెడీ అవుతుంది. మొత్తం 48 సీట్లలో.. మిగిలిన 10 చోట్ల శరద్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్దవ్ సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి.
సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ కోరుకున్న సాంగ్లీ స్థానం నుంచి ఉద్దవ్ శివసేన పోటీ చేస్తుంది. రెజ్లర్ చంద్రహర్ పాటిల్ ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. శివసేన కంచుకోటగా ఉన్న ముంబై నార్త్ సీటు కాంగ్రెస్‌కు దక్కింది. ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ వర్గం బారామతి, షిరూర్, సతారా, భివండి, దిండోరి, మాధా, రావర్, వార్ధా, అహ్మద్‌నగర్ సౌత్, బీడ్‌లలో పోటీ చేయనుంది. మ
హారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20 తేదీల్లో ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతాయి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో మహారాష్ట్రలో బీజేపీ 23 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.