దారుణం.. 15 ఏళ్ల అమ్మాయిపై 29 మంది అత్యాచారం

V6 Velugu Posted on Sep 23, 2021

మహారాష్ట్రలో దారుణం జరిగింది. థానే జిల్లాలోని డోంబివ్లీలో 15 ఏళ్ల అమ్మాయిని 29 మంది రేప్ చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉండటం గమనార్హం. ఘటనకు పాల్పడిన వారిలో 24 మందిని అరెస్ట్ చేయడంతో పాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ దత్తాత్రే కరాలే తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఆ అమ్మాయిని జనవరిలో రేప్ చేసి వీడియో తీశాడు. ఆ వీడియోతో అమ్మాయిన బ్లాక్ మెయిల్ చేస్తూ.. అతడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అదే వీడియోను అడ్డుపెట్టుకొని అతని ఫ్రెండ్స్ కూడా బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేశారు. అమ్మాయిని బెదిరిస్తూ జనవరి నుంచి ఇప్పటివరకూ డోంబివాలీ, బద్లాపూర్, ముర్బాద్, రబాలే ఏరియాల్లో అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేశారు. నిందితుల బెదిరింపులు ఎక్కువ కావడంతో.. బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి డోంబివ్లీ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు థానే జిల్లా పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‎ను ఏర్పాటు చేశారు.

For More News..

సిరిసిల్ల మాఫియాకు అడ్డాగా మారుతోంది

రకుల్, రానాలను కేటీఆరే తప్పించారు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

Tagged Maharashtra, GANG RAPE, Rape, Blackmail, Dombivli, minor gang rape, Dombivli Gang Rape

Latest Videos

Subscribe Now

More News