రకుల్, రానాలను కేటీఆరే తప్పించారు

V6 Velugu Posted on Sep 23, 2021

నిజామాబాద్: డ్రగ్స్ కేసులో సినిమా నటులను కేటీఆర్ రక్షించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, రానాలను  ఎక్సైజ్ కేసు నుంచి కేటీఆర్ తప్పించారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్‎లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడారు. 

‘వరి విషయంలో కేసీఆర్ రైతులను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి హుజురాబాద్ ఎన్నికలను వాయిదా వేయించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు రైతాంగ సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు? గత ఏడున్నర ఏండ్లలో తెలంగాణ పరిస్థితి అట్టడుగు స్థాయికి పడిపోయింది. వెంటనే వరి సాగుపై ప్రభుత్వం సరైన నిర్ణయం ప్రకటించాలి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆర్టీసీని ప్రైవేట్‎పరం చేసేందుకు ప్రభుత్వం బ్లూ ప్రింట్ గీసింది. మరో నాలుగైదు నెలల్లో ఆర్టీసీని ప్రైవేట్‎పరం చేసి ఆర్టీసీ ఆస్తులును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతారు’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

For More News..

 

హుజురాబాద్‎లో మంత్రులే లిక్కర్ పంచుతున్నారు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

నెలలో రెండోసారి కేసీఆర్ ఢిల్లీ టూర్

Tagged TRS, Telangana, Congress, KTR, Drugs Case, Rakul Preet Singh, rana, excise case

Latest Videos

Subscribe Now

More News