నెలలో రెండోసారి కేసీఆర్ ఢిల్లీ టూర్

V6 Velugu Posted on Sep 23, 2021

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 24, శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‎తో సమావేశమవుతారు. మరుసటి రోజు 26న విజ్జానభవన్‎లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‎తో  మాట్లాడుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం హైద్రాబాద్‎కు తిరుగు ప్రయాణమవుతారు.

కాగా.. రేపటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో పాల్గొని ఆ తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ మీద ఆయా పార్టీలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

For More News..

హుజురాబాద్‎లో మంత్రులే లిక్కర్ పంచుతున్నారు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని.. కేటీఆర్ స్పందన

 

Tagged Telangana, Delhi, CM KCR, Piyush Goyal, gajendra Singh Shekhawat, KCR Delhi Tour

Latest Videos

Subscribe Now

More News