సిరిసిల్ల మాఫియాకు అడ్డాగా మారుతోంది

V6 Velugu Posted on Sep 23, 2021

సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల.. మాఫియాకు అడ్డాగా మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ గురువారం గంభీరావు పేటకు చేరుకుంది. అక్కడ నిర్వహించిన రోడ్ షోలో సంజయ్ మాట్లాడారు.

‘తెలంగాణలో 2023లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మాఫియాలకు అడ్డాగా సిరిసిల్ల మారుతుంది. గట్టిగా వర్షం పడితే సిరిసిల్ల మునిగిపోతుంది. సిరిసిల్లను ఎంత అభివృద్ధి చేశాడో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెప్పాలి. కేంద్రం ఇచ్చిన నిధులతో వైకుంఠదామాలు నిర్మించి పింక్ కలర్ వేస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు నిధులివ్వడం లేదు. సర్పంచ్‎లకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేరుకు మాత్రమే ఎంపీటీసీలు. వారికి ఎటువంటి అధికారాలు లేవు. వరి వేస్తే ఉరే అని ఏ ముఖ్యమంత్రి అయినా అంటాడా? పంట మార్పిడి నేను వ్యతిరేకిస్త లేను. భూసార పరీక్షలు నిర్వహించి.. పంట మార్పిడి చేయాలి. కేంద్రం వరి కొంటలేదని అంటున్నారు. ప్రతి గింజా కొంటామని అన్నావ్ కదా మరి ఏమైంది. కేంద్రం కొనేది బియ్యం. రాష్ట్రాలు కొనాల్సింది వడ్లు. రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకోం. తెలంగాణలో రైతులను ప్రభుత్వం ఆదుకోలేదు. దళితబంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతి నియోజకవర్గనికి ఇవ్వాలి. ఇవ్వకపోతే బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అక్టోబర్‎లో ఉద్యమాలు చేపడుతాం.  హిందువులు పండుగలు చేసుకోవాలంటే పర్మిషన్లు తీసుకోవాలా? ఆర్టీసీ బస్ చార్జీలు పెంచితే ఊరుకునేది లేదు. పెట్రోల్, డీజిల్ మీద లీటర్‎కు 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతున్నాయి. అవసరమైతే 40 రూపాయలు తగ్గించి ఆర్టీసీని కాపాడాలి. కరెంట్, బస్ చార్జీలు పెంచితే అడుగు అడుగునా అడ్డుకుంటం’ అని బండి సంజయ్ అన్నారు.

For More News..

యూఎస్‎లో మోడీకి గ్రాండ్ వెల్‎కం.. జై మోడీ అంటూ నినాదాలు

రకుల్, రానాలను కేటీఆరే తప్పించారు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

Tagged Bjp, TRS, Bandi Sanjay, Telangana, CM KCR, KTR, Gambhiraopet, Siricilla, Praja Sangrama Yatra

Latest Videos

Subscribe Now

More News