యూఎస్‎లో మోడీకి గ్రాండ్ వెల్‎కం.. జై మోడీ అంటూ..

యూఎస్‎లో మోడీకి గ్రాండ్ వెల్‎కం.. జై మోడీ అంటూ..

అమెరికా: మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు వెళ్లిన ప్రధాని మోడీకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. వాషింగ్టన్ డీసీలో ఫ్లయిట్ దిగిన మోడీకి.. ఎన్ఆర్ఐలు జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, మోడీకి జై అంటూ నినాదాలు చేశారు. ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడ్డారు. మోడీతో పాటు జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్  ఆహ్వానం మేరకు క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లినట్లు మోడీ చెప్పారు. భారత్, అమెరికాల బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తన టూర్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సదస్సు తర్వాత వాణిజ్య, వ్యాపార పరంగా జపాన్, ఆస్ట్రేలియాలతోనూ భారత్ బంధం మరింత బలపడబోతోందని మోడీ అన్నారు. అఫ్గానిస్థాన్ అంశం మీద కూడా ఈ సదస్సులో చర్చకు వస్తుందన్నారు. 
  
రోజుల వారీగా మోడీ టూర్
అమెరికా టూర్లో భాగంగా మొదటి రోజు కార్పొరేట్ కంపెనీల సీఈఓలతో మోడీ భేటీ అవుతారు. భారత్‎లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరనున్నారు. తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమాలా హారిస్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్‎లతో కూడా సమావేశం అవుతారు. రెండో రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్‎తో భారత ప్రధాని మోడీ భేటీ అవుతారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై రివ్యూ చేస్తారు. వ్యాపార,వాణిజ్య సంబంధాలతో పాటు రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపైనా చర్చించనున్నారు. అనంతరం నాలుగు దేశాల ప్రతినిధులు క్వాడ్ సదస్సుకు హాజరు కానున్నారు. తీవ్రవాదం, సరిహద్దు ఉగ్రవాదం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అనంతరం మూడో రోజైన ఈ నెల 25న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మోడీ ప్రసంగించనున్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులపైనా మోడీ మాట్లాడనున్నారు. 

క్వాడ్ అంటే?
క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (QSD) దీనినే QUAD  అని కూడా పిలుస్తారు. చైనా ఆగడాలను అరికట్టేందుకు ఈ క్వాడ్‎ను 2007వ సంవత్సరంలో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబె ఏర్పాటుచేశారు. ఈ క్వాడ్‎కు మద్దతుగా అమెరికా, జపాన్, ఇండియాలను కలుపుకున్నారు. అయితే 2009వ సంవత్సరంలో కెవిన్ రడ్స్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన తర్వాత క్వాడ్ నుంచి ఆ దేశం తప్పుకుంది. అనంతరం 2010లో జులియా గిల్లర్డ్ ప్రధాని అయిన తర్వాత మరోసారి ఆస్ట్రేలియా క్వాడ్‎లో చేరింది.

For More News..

రకుల్, రానాలను కేటీఆరే తప్పించారు

హుజురాబాద్‎లో మంత్రులే లిక్కర్ పంచుతున్నారు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..