
ముంబై దాదర్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ మహిళను రైలు నుంచి కిందకు తోసేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు - ముంబై CSMT ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆగస్టు 6 రాత్రి 8.30 గంటలకు రిజర్వ్ చేయని మహిళల కంపార్ట్ మెంట్ లోకి ఓవ్యక్తి చోరీకి వచ్చాడు. దొంగ బ్యాగు లాక్కోవడంతో ఆ మహిళ ప్రతిఘటించింది. దీంతో దొంగ ఆమెను కంపార్ట్ మెంట్ నుంచి తోసేసి పారిపోయాడు. బాధితురాలి ఎవరు ఆమె పరిస్థితి ఎలా ఉందనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు.
అయితే ఆ మహిళ సోమవారం ప్రభుత్వ రైల్వే పోలీసులను (జిఆర్‌పి) సంప్రదించి కంప్టైంట్ చేసినట్లు అధికారి తెలిపారు. మహిళ కంప్టైంట్ చేయకముందే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. ముంబైలో రైలులో ప్రయాణికులపై దాడి జరగడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి.