ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్

ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్

సరిహద్దు వివాదంపై కర్ణాటక సీఎం అగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంటే.. మహారాష్ట్ర సీఎం షిండే మాత్రం మౌనంగా ఉన్నారని మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే విమర్శించారు. సుప్రీం తీర్పు వచ్చే వరకు.. బెలగావి, కార్వార్, నిప్పాణిలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సరిహద్దు వివాదంపై అసెంబ్లీలో చేసే తీర్మానంలో ఈ ప్రతిపాదన చేర్చాలని ఉద్దవ్ అన్నారు. 

అయితే ఉద్దవ్ థాక్రే విమర్శలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు. సరిహద్దులో ఇంచు భూమి తాము వదులుకోమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దుల్లో నివసించే తమ ప్రజలకు అన్యాయం జరగనివ్వబోమన్నారు. కేంద్రం దగ్గర, సుప్రీంకోర్ట్ లో సరిహద్దుపై పోరాడతామని తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు మహారాష్ట్ర సర్కార్ అండగా ఉంటుందన్నారు.