జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మే 02 మంగళవారం రోజున మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ వెల్లడించారు.
89 ఏళ్ల అరుణ్ గాంధీ .. ఏప్రిల్ 14, 1934న డర్బన్‌లో మహాత్మాగాంధీ కొడుకైన మణిలాల్ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు జన్మించారు. రచయితగా, సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. అరుణ్ గాంధీ కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లో నడిచారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ కొల్హాపూర్‌లో జరగనున్నాయి.
