
మహర్షి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు. F2 ఫేం డైరెక్టర్ అనీల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ 26వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఈ సినిమాను లాంచ్ చేసింది యూనిట్. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. “సరిలేరు నీకెవ్వరు” అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో జగపతి బాబు విలన్ రోల్‌లో కనిపించనున్నాడు.
దిల్ రాజు , అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనుండగా.. విజయ్ శాంతి కీలక పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా.. ప్రేక్షకులకి మంచి వినోదం అందించడం ఖాయం అని యూనిట్ అంటుంది. లాంఛనంగా ప్రారంభమైన సినిమా పూజా కార్యక్రమానికి రాఘవేంద్ర రావు, దిల్ రాజు, అనీల్ సుంకర, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు.
We are happy to collaborate with @AnilSunkara1 and @SVC_Official @AKentsOfficial for the 26th Film of our Super Star @urstrulymahesh and @AnilRavipudi #SarileruNeekevvaru pic.twitter.com/7msKQ5mvXL
— GMB Entertainment (@GMBents) May 31, 2019