
హిట్ కాంబినేషన్స్ రిపీట్ అయితే వారి సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుంది. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి తీయబోయే సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తిగా ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయమే. అనిల్ కూడా మహేష్ కోసం ఓ వండర్‌ఫుల్ స్టోరీ ప్రిపేర్ చేశాడట. దీని గురించి ఇండస్ట్రీలో ఇంటరెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. గత సినిమాలో మహేష్‌ని ఆర్మీ ఆఫీసర్‌గా చూపించిన అనిల్.. ఈసారి తనని స్పోర్ట్స్ పర్సన్‌గా చూపించబోతున్నాడని అంటున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అట. మహేష్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తాడట. తన మార్క్ కామెడీతో అనిల్ తయారు చేసిన స్టోరీకి ఇప్పటికే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. అయితే మహేష్ ఆల్రెడీ వరుస ప్రాజెక్టులకు కమిటై ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ పూర్తవకముందే త్రివిక్రమ్‌తో మూవీ ఓకే అయ్యింది. రాజమౌళితోనూ సినిమా చేయాల్సి ఉంది. దాంతో అనిల్, మహేష్ కాంబో ఎప్పుడు సెట్స్‌కి వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ‘ఎఫ్3’ డైరెక్ట్ చేస్తున్న అనిల్ ఇది పూర్తయ్యాక మరో మూవీ చేసి, ఆ తర్వాత మహేష్ సినిమాని పట్టాలెక్కించేందుకే ఎక్కువ చాన్సెస్ ఉన్నాయి.