
స్టార్స్ బర్త్‌డేలు వస్తున్నాయంటే ఫ్యాన్స్‌లో ముందునుంచే జోష్ మొదలవుతుంది. తమ అభిమాన హీరో నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి కొత్త అప్‌డేట్స్ వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ప్రస్తుతం అదే ఫీలింగ్‌తో ఉన్నారు. మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కొన్నాళ్లు దుబాయ్‌లో జరిగింది. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత హైదరాబాద్‌లో షూట్ రీస్టార్ట్ అయ్యింది. వచ్చిన గ్యాప్‌ని కవర్ చేయడానికి షూటింగ్ స్పీడు పెంచారట మేకర్స్. సెప్టెంబర్ నెలాఖరు కల్లా మొత్తం పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. వచ్చేయేడు సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేయడంతో, ఆ డేట్ కి ఎట్టి పరిస్థితులో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తోందట సర్కారు టీమ్. అలాగే వచ్చే నెలలో రానున్న మహేష్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ తో పాటు బర్త్ డే స్పెషల్ వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ , త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాల్సి ఉంది. మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా కొత్త అప్ డేట్ కానీ, మూవీ టైటిల్ కానీ అనౌన్స్ చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా బర్త్ డే కి మాత్రం ట్రీట్ గ్యారంటీ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.