
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ గురించి వినే ఉంటారు. భాగ్ మిల్కా భాగ్ మూవీతో నేషనల్ వైడ్ సినీ లవర్స్ దృష్టిని ఆకర్షించిన ఫర్హాన్.. తాజాగా తూఫాన్ మూవీ వస్తున్నాడు. అందులో బాక్సర్‌గా కనిపించేందుకు ఆయన తన దేహ దారుఢ్యాన్ని మలుచుకున్న తీరు సినీ ప్రముఖులను సైతం షాక్‌కు గురి చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమాను చూడటానికి ఎగ్జయింట్‌గా ఉన్నట్లు ప్రిన్స్ ట్వీట్ చేశాడు. ‘తూఫాన్ టీజర్ అద్భుతంగా ఉంది. ఫర్హాన్ మరోమారు దమ్మురేపాడు. పాత్ర కోసం అతడు తనను తాను మల్చుకున్న తీరు నమ్మశక్యంగా లేదు. ఈ సినిమాను చూడటానికి ఎదురుచూస్తున్నా’ అని మహేశ్ చెప్పాడు.