
బాక్సాఫీస్ దగ్గరే కాదు.. సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు మహేష్ బాబు. మొదట్లో ఎప్పుడైనా ఓ అప్‌డేట్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇతర చిత్రాలు నచ్చితే మెచ్చుకుంటాడు. తోటి యాక్టర్స్‌కి, టెక్నీషియన్స్‌కి విషెస్ చెబుతుంటాడు. తరచూ ఏదో ఒక విషయం షేర్ చేస్తాడు. అదే తనకి ఫాలోయింగ్‌ను పెంచింది. ట్విటర్‌లో పన్నెండు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుని సంచలనం సృష్టించడం చూస్తుంటే, తన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు మహేష్. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్ఆర్’ కారణంగా సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యింది. దాంతో ఈ నెలాఖరుకు మూవీని కంప్లీట్ చేసి, జనవరిలో ప్రమోషన్స్ మొదలుపెట్టే ప్లాన్‌లో ఉన్నారు. రీసెంట్‌గా తమన్ కూడా ఫస్ట్ సాంగ్ జనవరిలో వస్తుందని రివీల్ చేశాడు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న మహేష్.. ఈ సినిమాని ఈ నెలలోనే సెట్స్‌కి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. రామ్–లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ సీన్‌తో షూట్ చేయబోతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. రాజమౌళితోనూ మహేష్ ఓ మూవీ చేయనున్నాడు. దాన్ని వచ్చే యేడు స్టార్ట్ చేసే చాన్స్ ఉంది.