మహేష్ - రాజమౌళి మూవీ క్రేజీ అప్డేట్

మహేష్ - రాజమౌళి మూవీ క్రేజీ అప్డేట్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన కథను కంప్లీట్ చేసి.. గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు జక్కన్న ప్లాన్స్ చేస్తున్నారని టాక్. ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యే విధంగా యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందించనున్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగనుంది. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల్లో మహేష్ నటించారు. కానీ.. కమర్షియల్ సినిమాల్లో మాస్టర్ అయిన రాజమౌళి.. మహేష్ ను ఎలా చూపించబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

వచ్చే ఏడాది సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. పూర్తి సమయాన్ని ఈ సినిమాకు జక్కన్న కేటాయించనున్నారు. కథ విషయంలో తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో డిస్కషన్స్ చేస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘SSMB28’ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇక రాజమౌళి విషయానికి వస్తే... ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ మూవీని రూపొందించారు. మల్టీస్టారర్ గా తెరకెక్కించిన జక్కన్న.. ఇండియన్ బాక్సాపీస్ వద్ద వసూళ్ల వర్షం కరిసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి తో కెరీర్ లో తొలిసారిగా పనిచేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అవుతున్నారు.