తరతరాలకు మీరే స్ఫూర్తి..

తరతరాలకు మీరే స్ఫూర్తి..

మెగాస్టార్ చిరంజీవి 65 వ పుట్టిన రోజు సందర్భంగా పలువువు సినీతారలు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.  అన్నితరాలకు ఆయనొక స్పూర్తి అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

మెగాస్టార్ కు  పుట్టిన రోజు శుభాకాంక్షలని.. .ఇలాంటి ఆనందకరమైన బర్త్ డేలు ఎన్నో జరుపుకోవాలన్నారు జూనియర్  ఎన్టీఆర్.

వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్. తన హృదయంలో తనపై ఎప్పటికీ గౌరవం,ప్రేమ ఉంటుందన్నారు. తనకు నిజమైన ఆచార్యుడు అని అన్నారు.