
ఓవైపు సూపర్‌స్టార్‌గా వెలుగుతున్నాడు. మరోవైపు మంచి మనసుతో చిన్నపిల్లలకు అండగా నిలబడుతున్నాడు. అటు నటుడిగానూ ఇటు మంచి వ్యక్తిగానూ కూడా మనసులు గెల్చుకోవడం మహేష్ బాబుకే చెల్లింది. ఇప్పటి వరకు ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించాడు మహేష్. ఇప్పుడు తన సేవని మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ ప్రముఖ చిల్డ్రన్ హాస్పిటల్‌తో చేతులు కలిపాడు. మరింత ఎక్కువమంది పేద పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయించబోతున్నాడు. తన కొడుకు ప్రీమెచ్యూర్ బేబీ కావడంతో చాలా టెన్షన్ పడ్డానని, తమకి డబ్బులు ఉన్నాయి కాబట్టి తమ బిడ్డను కాపాడుకోగలిగానని, అలా లేనివాళ్ల పరిస్థితి ఏమిటి అని ఆలోచించే ఇలా సేవ చేస్తున్నానని రీసెంట్‌గా ఓ సందర్భంలో చెప్పాడు మహేష్. తన సేవను ఇప్పుడు మరింత విస్తరించి మరోసారి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు.
ఇక సినిమాల విషయానికొస్తే ‘సర్కారువారి పాట’ మే 12న విడుదల కాబోతోంది. అంతకంటే ముందే త్రివిక్రమ్‌తో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇక రాజమౌళితో కూడా కమిట్‌మెంట్ ఉంది మహేష్‌కి. త్రివిక్రమ్ సినిమా చేశాకే జక్కన్న సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదని, రెండు సినిమాలూ ఒకే సమయంలో చేయబోతున్నాడని తెలిసింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న అడ్వెంచరస్ మూవీని అతి త్వరలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఈ విషయమై శుక్రవారం మహేష్, నారాయణలతో డిస్కషన్స్ కూడా జరిగాయట. మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.