
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మంచి హిట్ టాక్ తో రన్ అవుతోంది. పవన్ తోపాటు అంజలి, నివేతా థామస్, అనన్య నాగళ్ల నటనకు మంచి అప్లాజ్ వస్తోంది. తాజాగా ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ఈ మూవీలో పవన్ నటన టాప్ లెవల్ లో ఉందని, ఇది పవర్ ప్యాక్డ్ పవన్ పెర్ఫార్మెన్స్ ఫిల్మ్ అని మహేశ్ పొగడ్తల వర్షం కురిపించాడు. పవన్ నుంచి అద్భుతమైన కంబ్యాక్ సినిమా అని, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటన నిజంగా అద్భుతమని కొనియాడాడు. అంజలి, నివేతా థామస్, అనన్యల నటన హృద్యంగా ఉందని, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరో స్థాయిలో ఉందని ప్రిన్స్ ట్వీట్ చేశాడు.