
పరశురామ్ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా ఈ నెల 12 రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ పెంచుతున్న యూనిట్ సర్కారువారి పాటకు సంబంధించిన అప్డేట్స్ వదులుతున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. అదిరిపోయే డైలాగ్స్ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 2నిమిషాల-37 సెకన్లున్న ట్రైలర్ ప్రారంభంలోనే మహేష్ వాయిస్ తీసుకొచ్చారు. ‘‘నా ప్రేమను దొంగిలించగలవు.. నా స్నేహాన్నీ దొంగిలించగలవు...నా డబ్బును మాత్రం దొంగిలించలేవు’ అని మహేశ్‌బాబు చెప్పే డైలాగ్ తో ట్రైలర్‌లో ప్రారంభంకాగా .. ‘అమ్మాయిల్ని.. అప్పు ఇచ్చేవాళ్లను పాంపర్ చేయాలి రా’ అంటూ హాస్యాన్ని పంచాడు. ‘‘దిస్ ఈజ్ మహేశ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడ బీచ్ సర్..’ అంటూ మహేశ్ చెప్పిన మరిన్ని డైలాగ్‌లు అలరిస్తున్నాయి.
‘‘మీరొక పదివేల డాలర్లు అప్పు ఇస్తే.. ఎగ్జామ్ ఫీ కట్టి.. మాస్టర్స్‌లో టాప్ స్కోర్ చేస్తాను’ అని కీర్తి సురేశ్ చెబుతున్న డైలాగ్‌కు ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ పొలిటికల్ డైలాగ్ వదిలాడు మహేశ్. ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఈ నెల 12 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్. తమన్ మ్యూజిక్. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు.