
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ మరోసారి కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడే అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. కాస్త ఆలస్యంగా సెట్స్‌కి వెళ్లినా మొదటి షెడ్యూల్‌ని శరవేగంగా పూర్తి చేసింది టీమ్. సెకెండ్ షెడ్యూల్ స్టార్టవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల లేటయ్యింది. దాంతో మరోసారి అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అది గమనించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిన్న ఒక అప్‌డేట్ ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే సెకెండ్ షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నామని చెప్పారు. ఇది మోస్ట్ అవైటెడ్ యాక్షన్ షెడ్యూల్ అని రివీల్ చేసిన ఆయన.. త్వరలోనే మరిన్ని ఎక్సైటింగ్ అప్‌డేట్స్ ఇస్తామని మాటిచ్చారు. ఫ్యామిలీతో లండన్ వెకేషన్‌కి వెళ్లిన మహేష్ నిన్న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. కాబట్టి అతి త్వరలో రెండో షెడ్యూల్ మొదలయ్యే చాన్స్ ఉంది. ఇది మహేష్ బాబుకి ఇరవై ఎనిమిదో చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. ‘అయోధ్యలో అర్జునుడు’ సహా ‘అ’తో మొదలయ్యే పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.