Mahesh Babu: 'నువ్వు ఎప్పటికీ నా చిన్న స్టార్‌వే'.. సితారకు మహేష్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్!

Mahesh Babu: 'నువ్వు ఎప్పటికీ నా చిన్న స్టార్‌వే'.. సితారకు మహేష్ బాబు ఎమోషనల్ బర్త్‌డే  విషెస్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారల కోసం సమయం కేటాయించడం ఆయనకు అలవాటు. లేటెస్ట్ గా తన ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జూలై 20న సితార 14వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో అభిమానుల ఆకట్టుకుంటుంది. బర్త్‌డే సెలబ్రేషన్స్ మధ్యలో సితారకు  ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించిన మహేష్, తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చూపించారు. టేబుల్‌పై బర్త్‌డే డెకరేషన్స్, పార్టీ క్యాప్స్, సితార తలపై అందమైన క్రౌన్ ఆ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. 

'నువ్వు ఎంత పెద్దదానివైనా... నాకు ఎప్పటికీ నా చిన్న స్టార్‌వే. హ్యాపీ 14 సితార' అంటూ ఆ ఫోటోకు మహేష్ బాబు క్యాప్షన్ పెట్టారు.  ఈ ఏడాది నీ జీవితంలో మరెన్నో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను. 'లవ్ యూ ఆల్వేస్' అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌కు క్షణాల్లోనే లక్షలాది లైకులు, వేలాది కామెంట్లు వచ్చాయి. అభిమానులు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

 

మరోవైపు సితార తల్లి నమ్రత శిరోద్కర్ కూడా తన కూతురికి ఎంతో ఎమోషనల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. 'మా జీవితాలను ప్రేమతో, ఆనందంతో నింపిన నా అందమైన అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతున్న ప్రతి క్షణం మా జీవితంలో గొప్ప ఆశీర్వాదం. లవ్ యూ సో మచ్' అంటూ ఆమె రాసిన సందేశం కూడా అభిమానులను ఆకట్టుకుంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఘట్టమనేని, తన డ్యాన్స్ వీడియోలు, స్టైలిష్ లుక్స్, యాడ్స్, సినీ ఈవెంట్లలో కనిపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భవిష్యత్తులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదని అభిమానులు ఇప్పటినుంచే కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ :  ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఏంటి..

ఇక మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌలి తెరకెక్కిస్తున్న భారీ పాన్-వరల్డ్ 'వారణాసి' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సినిమా పనులతో తీరిక లేకపోయినా, కూతురు పుట్టినరోజును ఘనంగా జరుపుకుని మరోసారి 'ఫ్యామిలీ ఫస్ట్' అనే తన భావాన్ని చాటుకున్నారు. అందుకే మహేష్ బాబును అభిమానులు కేవలం సూపర్ స్టార్‌గా మాత్రమే కాకుండా, బెస్ట్ ఫాదర్‌గా కూడా ప్రశంసిస్తున్నారు.