
మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో.. ‘పోకిరి’ మూవీ రీ రిలీజ్ టిక్కెట్లు అమ్ముడైన స్పీడు ప్రూవ్ చేసింది. ఎప్పుడో విడుదలైన ఈ సినిమాని మరోసారి వెండితెరపై చూడటానికి విదేశాల్లోని అభిమానులు సైతం ఎగబడ్డారు. ఇక అతని కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఏ రేంజ్‌లో ఎదురు చూస్తారో చెప్పాల్సిన పని లేదు. బర్త్ డే నాడు కచ్చితంగా ఏదో ఒక కొత్త కబురు అందుతుందనే ఆశతోనే అంతా ఉన్నారు. కబురైతే అందింది. కానీ వాళ్లు ఆశించిన స్థాయి అప్‌డేట్ అయితే కాదది. తన ఇరవై ఎనిమిదవ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు మహేష్. ఈ మూవీని ప్రకటించి చాలా కాలమే అయ్యింది.
ఆమధ్య ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దాంతో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ వెయిటింగ్. ఆగస్టులో షూట్ స్టార్ట్ చేసి, వచ్చే సమ్మర్‌కి రిలీజ్ చేస్తామని గత నెలలో ప్రకటించడంతో మహేష్ బర్త్ డేకి కచ్చితంగా స్టార్టవుతుందేమో అనుకున్నారు. కానీ అలా జరగలేదు. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది అని చెప్పారంతే. మరి ఆ త్వరలో అనేది ఎంత త్వరలోనో తెలియాల్సి ఉంది. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో నటించనున్నాడు మహేష్. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో మరి.