
రివ్యూ: మహర్షి
రన్ టైమ్: 2 గంటల 58 నిమిషాలు
నటీనటులు: మహేష్ బాబు, పూజా హెగ్డే, నరేష్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, కమల్ కామరాజు, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కె.యు మోహనన్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
కథ,డైలాగులు: హరి- సాల్మాన్
నిర్మాతలు: దిల్ రాజు,అశ్వినీదత్,పి.వి.పి
కథనం,దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథేంటి?
రిషి (మహేష్ బాబు) టాలెంటెడ్ పర్సన్. లైఫ్ లో ఎప్పూడూ సక్సెస్ కావాలనుకుంటాడు.తనను తాను హై రేంజ్ లో చూడాలనుకుంటాడు.అనుకున్నట్టే యూ.ఎస్ లో పెద్ద బిలీనియర్ గా సెటిలవుతాడు.కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కలిసిన గెట్ టుగెదర్ లో తన క్లోజ్ ఫ్రెండ్ రవి (అల్లరి నరేష్) గురించి ఓ షాకింగ్ నిజం తెలుసకుంటాడు.అదేంటి.? తన ఫ్రెండ్ కోసం ఏం చేశాడు అనేది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
మహేష్ బాబు మంచి నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు.కాలేజ్ స్టూడెంట్ గా,బిజినెస్ మేన్ గా,చివర్లో రైతుగా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అందించాడు. అల్లరి నరేష్ కు మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కింది. తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు.పూజా హెగ్డే పాటలకే పరిమితమైంది.. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావు రమేష్ లు రాణించారు.
టెక్నికల్ వర్క్:
కె.యు మోహనన్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ప్రతీ సీన్ ను అందంగా తీర్చిదిద్దాడు. దేవీశ్రీ ప్రసాద్ పాటల్లో రెండు బాగున్నాయి..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆర్ట్ వర్క్, యాక్షన్ సీన్లు చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ లో కొన్ని సీన్లు తీసేయాల్సింది. సంభాషణలు మెప్పిస్తాయి. నిర్మాతలు రాజీపడకుండా భారీగా తెరకెక్కించారు.
విశ్లేషణ:
సక్సెస్, డబ్బు ఉంటే చాలు ప్రపంచాన్నే ఏలేయవచ్చు అనుకునే రిషి.. జీవితం అంటే అది కాదని..‘‘మహర్షి’’గా ఎలా మారాడన్నదే ఈ సినిమా కథ.. ఇందులో ‘‘శ్రీమంతుడు’’ షేడ్స్ కనిపిస్తాయి. స్టోరీ రెగ్యులరే అనిపించినా..వంశీ పైడిపల్లి చివరి ఘట్టాలను కాస్త ఎమోషనల్ గా నడిపి పాసయ్యేలా చేశాడు.ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా సాగినా.. నిడివి ఎక్కువ కావడం వల్ల సాగతీతగా అనిపిస్తుంది..సెకండాఫ్ లో కూడా అదే పరిస్థితి.. కాకపోతే చివరి 30 నిమిషాలు రైతుల ఇంపార్టెన్స్ గురించి చెప్పడం వల్ల అందరూ కనెక్టవుతారు.
ఇకపోతే వంశీ పైడిపల్లి రాసుకున్న కథనంలో లోపాలున్నాయి. చాలా సీన్లల్లో ఎమోషన్.. ఫోర్స్ డ్ గా అనిపిస్తుంది తప్ప న్యాచురల్ గా ఉండదు. రిషి క్యారెక్టర్ చేత సక్సెస్ గురించి అన్నిసార్లు లెక్చర్లు ఇప్పించడం కూడా విసిగిస్తుంది. ఫస్టాఫ్ లో ఎలాంటి మెరుపులు లేకపోగా.. సెకండాఫ్ స్టార్టయ్యాక సినిమా పేస్ మొత్తం పడిపోతుంది. అయితే ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ ను బాగా తీయడం వల్ల సినిమా బాగుందనిపిస్తుంది.. మహేష్ బాబు ప్రజెన్స్, గ్రాండ్ విజువల్స్, చివరి 30 నిమిషాల బాగా కుదిరాయి.