పోక్సో కేసులో బాధితురాలికి అండగా ఉంటం..మహిళా కాంగ్రెస్ నేతల ప్రకటన

పోక్సో కేసులో బాధితురాలికి అండగా ఉంటం..మహిళా కాంగ్రెస్ నేతల ప్రకటన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ చేతిలో మోసపోయిన బాలికకు తాము పూర్తి అండగా నిలుస్తామని  కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ప్రకటించారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేశారు. త్వరలోనే బాధితురాలిని కలిసి వాస్తవాలు తెలుసుకుంటామని  పేర్కొన్నారు.