జూబ్లీహిల్స్, వెలుగు: ఉగాది సందర్భంగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో ‘మహిళావరణం’ ఫొటోగ్రఫీ ప్రదర్శన మంగళవారం బంజారాహిల్స్‌లోని జర్మన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రారంభమైంది. మహిళల జీవితంలోని భావోద్వేగాలు, సంస్కృతి, సామాజిక కోణాలను ప్రతిబింబించే అరుదైన ఫోటోలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు తోట వైకుంఠం, హిందూస్థానీ శాస్త్రీయ గాయని విద్యారావు ఈ గ్యాలరీని ప్రారంభించారు.
ఫొటోలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 10 వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. ఆదివారాలు, పబ్లిక్ హాలీడేస్ రోజుల్లో సెలవు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
