మార్కెట్లోకి యూవీ 7ఎక్స్ఓ

మార్కెట్లోకి యూవీ 7ఎక్స్ఓ


మహీంద్రా సంస్థ తన పాపులర్ ఎక్స్​యూవీ 700 ఫేస్​లిఫ్ట్ వెర్షన్ ను ఎక్స్​యూవీ 7ఎక్స్ఓ పేరుతో విడుదల చేసింది.  ధరలు రూ.13.66 లక్షలు– రూ.24.92 లక్షలు (ఎక్స్ షోరూం) వరకు ఉంటాయి. ఇందులో రెండు లీటర్ల టర్బో పెట్రోల్, 2.2 లీటర్ల డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 200 పీఎస్ పవర్, 380 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. డీజిల్ ఇంజన్ 185 పీఎస్ పవర్, 450 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  12.3 ఇంచుల స్క్రీన్లు, 540 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ప్లస్ ఏడీఏఎస్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 16 స్పీకర్ల హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఫీచర్లు ఉన్నాయి.