రవీంద్రభారతిలో కళ్లకు కట్టేలా మహిషాసుర సంహారం

 రవీంద్రభారతిలో కళ్లకు కట్టేలా మహిషాసుర సంహారం

 రవీంద్రభారతిలో సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా  మంగళవారం చెన్నైకు చెందిన నాట్య గురు వెంపటి ప్రియాంక శిష్య బృందం నవ దుర్గ నృత్య నాటకం ప్రదర్శించారు. మహిషా సురుడు కఠోర తపస్సు చేసి మరణం లేని వరం బ్రహ్మ నుంచి పొందడం, ముల్లోకాలను తన అహంకారంతో అల్లాడించడం, దాంతో దేవతలంతా కలిసి ఆ రాక్షసుడిని సంహరించమని వేడుకోవడం వంటి సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. 9 రూపాల్లో ఆయుధాలు ధరించిన దుర్గాదేవి తనను తాను ఆయుధంగా మలుచుకున్న తీరు కళ్లను కట్టిపడేసింది.