అమిత్ షా పిలిచినందుకే యూసఫ్ పఠాన్ ఢిల్లీకి పోయిండు.. మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా పిలిచినందుకే యూసఫ్ పఠాన్ ఢిల్లీకి పోయిండు.. మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు

West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సుమారు 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలు ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటించారనే వార్తలు వస్తున్న తరుణంలో.. పార్టీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) తన తోటి ఎంపీ, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan) ను టార్గెట్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో గట్టిగా నిలదీసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేయగానే యూసుఫ్ ఢిల్లీకి పరిగెడుతున్నాడంటూ మహువా సంచలన ఆరోపణలు చేసింది.

కొంచెం ధైర్యం ప్రదర్శించు భాయ్: 
యూసుఫ్ పఠాన్‌ను ట్యాగ్ చేస్తూ మహువా మోయిత్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీరియస్ పోస్ట్ పెట్టింది. అమిత్ షా పిలిచాడని నువ్వు (యూసఫ్ పఠాన్) ఢిల్లీకి పరిగెడుతున్నావా?.. కొంచెం ధైర్యం ప్రదర్శించు.. నువ్వు ఇండియా కోసం క్రికెట్ ఆడావు.. మన డిస్ట్రిక్ట్ జనాలు నిన్ను భారీ మెజారిటీతో గెలిపించారు.. కొంచెం సిగ్గు ఉండాలంటూ ఆమె ఫైర్ అయ్యింది.

20 మంది ఎంపీల తిరుగుబాటు: 
20 మంది టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తూ ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారనే నివేదికలు రావడంతోనే ఈ రచ్చ స్టార్ట్ అయింది. ఈ రెబెల్ ఎంపీల గ్రూప్ అంతా ఢిల్లీలో మీటింగ్ పెట్టడంతో.. టీఎంసీ పార్టీలో విభేదాలు గట్టిగానే ఉన్నాయనే ఊహాగానాలు నడుస్తున్నాయి. మహువా మోయిత్రా చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఆధారాలు ఏవని అడుగుతున్నారు.

►ALSO READ | ఆఫ్ఘనిస్థాన్‌పై భారీ విజయం.. కానీ టీమిండియాకు నో యూజ్.. కారణం ఇదే!

ఆ వార్తలని కొట్టిపారేసిన యూసుఫ్ పఠాన్: 
ఇదిలా ఉంటే.. మమతా బెనర్జీ ఉపఎన్నికలో పోటీ చేయడం కోసం, బహరంపూర్ లోక్‌సభ స్థానానికి యూసుఫ్ పఠాన్‌ను రాజీనామా చేయమని అడిగారనే వార్తలు రీసెంట్‌గా వచ్చాయి. ఈ ప్రచారాన్ని యూసుఫ్ పఠాన్  పూర్తిగా కొట్టిపారేశాడు. ఇదంతా పక్కా అబద్ధమని, దీదీ గానీ, పార్టీలోని ఏ ఇతర లీడర్ గానీ తనను రాజీనామా చేయమని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశాడు. ఇక మమతా బెనర్జీ తరఫున తాను యూసుఫ్ పఠాన్‌తో మాట్లాడాననే వార్తలను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా తప్పుబట్టాడు. ఆ ఆరోపణల్లో నిజం లేదని,  ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరాడు..