పద్మారావునగర్, వెలుగు: కవాడిగూడలోని నెక్లెస్ప్రైడ్ అపార్ట్మెంట్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులను గాంధీనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దోమలగూడకు చెందిన వేముల శ్రీవాణి అదే అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్‌లో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తూ ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా డైమండ్ రింగ్, గొలుసు సహా 3.5 తులాల బంగారాన్ని దొంగిలించింది.
మరో ఫ్లాట్‌లో 4.25 తులాల మంగళసూత్రం గొలుసును ఎత్తుకెళ్లింది. ఈ సొత్తును అమ్మడంలో ఆమె భర్త శీలం చంద్రకాంత్ సహకరించాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు విచారించి 6.8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శ్రీవాణి అరెస్ట్‌కు ముందు పెద్ద నాటకమే ఆడింది.
దొంగతనం చేయకముందే ఫ్లాట్యాజమాని, పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఈ నెల 7న నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎదుట పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే గాంధీనగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారించగా, దొంగతనం చేసింది శ్రీవాణి దంపతులేనని తేలింది. నేరాన్ని అంగీకరించడంతో శనివారం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

