సెకండ్ వేవ్ లో నీరసమే ముఖ్య లక్షణం

సెకండ్ వేవ్ లో నీరసమే ముఖ్య లక్షణం
  • ఈసారి దగ్గు, సర్ది తక్కువే
  • కొందరిలో లక్షణాలు లేకున్నా 
  • లంగ్స్ కరాబైతున్నయ్

కరోనా వైరస్ సోకితే ఇదివరకు దగ్గు, సర్దితో మొదలై రకరకాల లక్షణాలు వచ్చేవి. అయితే, సెకండ్ వేవ్లో మాత్రం దగ్గు, సర్ది కంటే నీరసం ముఖ్యలక్షణంగా కనిపిస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఇతర లక్షణాలు ఏవీ లేకుండా, నీరసం ఉన్నప్పటికీ కరోనాగా అనుమానించాలని చెప్తున్నారు. కరోనా సోకినవాళ్లలో కొంత మందిలో కనీసం సొంత పనులు కూడా చేసుకోలేనంతగా వీక్నెస్  కనిపిస్తోందంటున్నారు. నీరసంతో పాటు బాడీ పెయిన్స్, జ్వరం వంటి లక్షణాలు కూడా ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్  డాక్టర్ రాజారావు చెప్పారు. జీవితంలో ఇంతకుముందెన్నడూ లేనంతగా నీరసం వచ్చిందని పేషెంట్లు చెప్తున్నారని ఆయన వివరించారు. ఇలాంటి లక్షణాలు ఉంటే కరోనా టెస్టు చేయించుకోవాలని రాజారావు సూచించారు. అయితే అందరిలోనూ ఇలాగే ఉండాలన్న రూలేమీ లేదన్నారు. కొంత మందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా లంగ్స్ పాడవుతున్నాయని చెప్పారు. పది శాతం కేసుల్లో వైరస్ సోకిన ఒకట్రెండు రోజుల్లోనే సీరియస్ అవుతుందన్నారు. 90 శాతం మంది రెండో వారంలో సీరియస్ స్టేజ్కు వస్తున్నారని రాజారావు వివరించారు. రెండో వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.