నాయినోనిపల్లి మైసమ్మ ఆదాయం రూ.3.02 లక్షలు

నాయినోనిపల్లి మైసమ్మ ఆదాయం రూ.3.02 లక్షలు

కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. టికెట్ల ద్వారా రూ.1,38,445, హుండీ ద్వారా రూ.1,64,362 కలుపుకొని రూ.3,02,807 ఆదాయం వచ్చినట్లు టెంపుల్  చైర్మన్  యాదవ్, ఈవో రామేశ్వర శర్మ తెలిపారు. నాగర్ కర్నూల్  డివిజన్  ఎండోమెంట్  ఇన్స్ పెక్టర్  మదన్ కుమార్, జూనియర్  అసిస్టెంట్  శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.