హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

సూర్యాపేట: హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న మైత్రి ట్రావెల్స్‌ బస్సు సూర్యాపేట జిల్లా మోతె మండలంలో ప్రమాదానికి గురైంది. హుస్సేనాబాద్‌ గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా  బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఈ బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.