వరంగల్ జిల్లాలో మక్క రైతుల ఆందోళన

వరంగల్ జిల్లాలో మక్క రైతుల ఆందోళన

నెక్కొండ/ రాయపర్తి, వెలుగు: వరంగల్​ జిల్లా నెక్కొండ, రాయపర్తి మండల కేంద్రాల్లో గురువారం మొక్కజొన్న రైతులు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేపట్టారు. నెక్కొండలో నర్సంపేట ప్రధాన రహదారిపై, రాయపర్తిలో వరంగల్​– ఖమ్మం హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. 

కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కాంటాలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని అన్నారు. ట్రాఫిక్​ జామ్​ కావడంతో పోలీసులు వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.