చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

చిలీలో ఇవాళ(ఆదివారం) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై  ఈ భూ కంప తీవ్రత 7గా నమోదైంది. అంటార్కిటికా తీరంలోని చిలీయన్ బేస్ లో సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, టూరిస్టులు సముద్ర తీర ప్రాంతాన్ని ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించారు.  ముందస్తు జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.