మోదీ న్యూఇయర్ గిప్ట్ .. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మోదీ న్యూఇయర్ గిప్ట్ ..   తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మోదీ సర్కారు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది.  పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను భారీగా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది. లీటర్‌  డీజిల్‌ మీద ఎనిమిది  రూపాయలు,  పెట్రోల్ మీద పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది . కొత్త సంవత్సరానికి మోదీ ధమాకా కానుక ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.  

రేపో, ఎల్లుండో ఈ ప్రకటన నేరుగా ప్రధాని  మోదీనే చేయవచ్చని సమాచారం. పెట్రోలియమ్‌ శాఖ ఇప్పటికే ఈ ధరల తగ్గింపు కసరత్తును పూర్తిచేసింది. అంటే ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్‌ ధరలు కాస్త దిగి వచ్చే చాన్స్‌ ఉందన్నమాట.  

వచ్చే ఏడాది మార్చిలో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్.. ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.  పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో పాటుగా గ్యాస్ సిలిండర్ ధరలను కూడా భారీ స్థాయిలో తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  

ఇక  ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96.72 ఉండగా,  లీటర్ డీజిల్ ధర 89.62 ఉంది.  ముంబై, బెంగళూరు, హైదరాబాద్  వంటి ప్రధాన నగరాల్లో రూ. 100 కంటే ఎక్కువగా ఉన్నాయి. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం 2022 మే 22న పెట్రోల్, డీజిల్ ధరలపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసింది. పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున పన్ను తగ్గించింది.  

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో, భారత్ లోని  మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు - ఇండియన్ ఆయిల్ కార్ప్ (IOC), భారత్ పెట్రోలియం కార్ప్ (BPCL) , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) లాభాల బాటలోనే ఉన్నాయి.