మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు

మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ స్క్రాప్ దుకాణంలో ఆదివారం (ఆగస్ట్ 24) రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

స్క్రాప్ దుకాణం నుంచి ఎగిసి పడుతోన్న మంటలను ఫైరింజన్ల సహయంతో ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా చెలరేగి పొగ దట్టంగా అలుముకోవడంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

►ALSO READ | భర్తలా..? కిరాయి హంతకులా..? సోమశిలకు పోదామన్నడు.. ఏం పాపం చేసిందని ఇలా చేశాడు..?

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమయంలో స్క్రాప్ దుకాణంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా అన్న విషయం తెలియరాలేదు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలపై క్లారిటీ లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.