భర్తలా..? కిరాయి హంతకులా..? సోమశిలకు పోదామన్నడు.. ఏం పాపం చేసిందని ఇలా చేశాడు..?

భర్తలా..? కిరాయి హంతకులా..? సోమశిలకు పోదామన్నడు.. ఏం పాపం చేసిందని ఇలా చేశాడు..?

నాగర్ కర్నూల్: భార్యను అడవిలో హతమార్చిన భర్త కాల్చి ఆమె మృతదేహాన్ని తగలబెట్టిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. పెద్ద కొత్తపల్లి పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేసి జరుపుతున్నారు. పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని సాతాపూర్-మారేడుమాన్ దిన్నే అడవి ప్రాంతంలో భార్యను హత్య చేసి కాల్చి చంపిన ఘటన వెలుగుచూసింది. పెద్ద కొత్తపల్లి ఎస్సై వి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం అనే యువకుడు 2014లో మహబూబ్ నగర్కు చెందిన శ్రావణి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి  బాబు, కూతురు ఉన్నారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉండడంతో శ్రావణి భర్తకు దూరంగా మహబూబ్ నగర్లో పిల్లలతో ఉంటున్నది.

►ALSO READ | వామ్మో.. జగిత్యాల జిల్లాలో సండే రోజు.. మేక మాంసం కొన్నోళ్ల పరిస్థితి ఇది..!

ఈ నెల 21వ తేదీన ఆమె భర్త శ్రీశైలం.. మహబూబ్ నగర్ వెళ్లి భార్యతో బైక్పై  సోమశిలకు వెళ్దామని మాయమాటలు చెప్పి పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్- మారేడుమాన్ దిన్నే అడవి ప్రాంతంలో శ్రావణిని 27.. హత్య చేసి కాల్చి చంపాడు. దీంతో.. శ్రావణి తండ్రి మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. శ్రావణి తానే చంపానని హత్య చేసిన స్థలాన్ని  చూపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ టూ టౌన్ సీఐ ఎజాజుద్దీన్, ఎస్సై పోచ నరేందర్ రెడ్డి, ఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.