హైదరాబాద్ చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల వేసుకున్న గుడిసెలు మంటల్లో తగలబడ్డాయి. సుమారు 50 గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి.
చందానగర్ జవహర్ నగర్ కాలని SVS నిర్మాణ సంస్థ అంపిల్ నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణానికి సంబంధించిన కార్మికులు అక్కడే గుడిసెలు వేసుకున్నారు. డిసెంబర్ 1న సాయంత్రం ఒక్కసారిగా గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటనేదానిపై ఆరాదీస్తున్నారు.
