కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయండి

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయండి

 ముషీరాబాద్,వెలుగు: ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొంతకాలంగా పర్మినెంట్ చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నా  ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  సీఎం  రేవంత్ రెడ్డి స్పందించి  చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన ర్యాలీని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ తో కలిసి ఆర్. కృష్ణయ్య ప్రారంభించి మాట్లాడారు. 

వర్సిటీ, విద్య,వైద్య, ఆరోగ్య శాఖల్లో దాదాపు  లక్ష 50 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 15 ఏండ్లుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.   రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా విద్యార్హతలు, స్కిల్స్ ఉన్నప్పటికీ చాలీచాలని జీతాలతో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ దిశగా చర్యలు తీసుకువడం లేదన్నారు. రమేశ్,  వెంకటేశ్​ వెంకటేశ్, సుధాకర్, నందగోపాల్ ఉన్నారు.