ఈ - రేస్ ను సక్సెస్ చేయండి : హీరో ప్రభాస్

ఈ - రేస్ ను సక్సెస్ చేయండి : హీరో ప్రభాస్

ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో జరగనున్న ఫార్ములా ఈ రేస్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఈ రేస్ గ్రేటర్ లో జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ రేస్ నిర్వహణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి, గ్రీన్‌ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని ప్రభాస్ ప్రశంసించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.  ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాలో ఓ వీడియో రూపంలో రిలీజ్ చేశారు.  ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్‌ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో పాటు మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఈ ప్రిక్స్ లను ట్యాగ్ చేశారు.