
పౌరాణిక యానిమేటెట్ చిత్రం 'మహావతార్ నరసింహ' ( Mahavtar Narasimha ) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇండియాలోనే కాదు విదేశాల్లో సైతం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం OTTలోకి రాబోతుందంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై వస్తున్న పుకార్లను , వార్తలను సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ ఖండించారు. ఇలాంటి పుకార్లకు దూరంగా ఉండాలని , అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని పోస్ట్ చేశారు.
ప్రస్తుతానికి ఏ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ తో ఒప్పందం కుదుర్చుకోలేదని నిర్మాతలు స్పష్టం చేశారు. OTTలో రిలీజ్ చేస్తున్నట్లు వస్తున్న వదంతులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రస్తుతానికి 'మహావతార్ నరసింహ' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మేము ఇంకా ఏ OTT ప్లాట్ ఫామ్ ను ఫైనల్ చేయలేదు. వదంతులు నమ్మొద్దు. మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి చేయబడిన ప్రకటన మాత్రమే నమ్మండి. 'మహావతార్ నరసింహ' సినిమాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని పోస్ట్ చేశారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక యానిమేటెట్ 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.110 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని క్లీమ్ ప్రొడక్షన్స్, హూంబలే ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ యూనిమేటెడ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీపరితమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ యానిమేటేడ్ పౌరాణిక చిత్రంగా నిలిచింది. అన్ని భాషల నుంచి ఈ మూవీ భారీగానే కలెక్షన్స్ వసూళ్లు చేస్తోంది. ఇందులో సింహభాగం హిందీ వెర్షన్ నుంచి రాగా తరువాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఉన్నాయి.