పాపం ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్. పాపం అని ఎందుకన్నాం అంటే.. ఆయన హీరోగా వస్తున్న ఏ సినిమా కూడా అనుకున్న డేట్ కు విడుదల కావడం లేదు. బాహుబలి(Bahubali) నుండి మొదలువుపెడితే మొన్న వచ్చిన సలార్(Salaar) వరకు అన్ని సినిమాలు పోస్ట్ అయ్యి వచ్చినవే. ముందు ఒక డేట్ అనౌన్స్ చేయడం తరువాత పోస్ట్ పోన్ చేయడం.. దాంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవడం. గత నాలుగు సినిమాలుగా ఇది కంటిన్యూ అవుతూవస్తోంది. ఇప్పుడు మరో సినిమా కూడా పోస్ట్ కాకూండా రిలీజ్ కావడంలేదు. అదే ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD).
దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఈ కల్కి సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఈక్రమంలోనే తాజాగా కల్కి సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ న్యూస్ విని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆనందపడేలోపే.. మళ్ళీ పోస్ట్ పోన్ కానుంది అనే విషయం తెలిసి డిజప్పాయింట్ అవుతున్నారు. కారణం.. మే నెలలో దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా మొదలుకానుంది. కాబట్టి.. అన్ని రాష్ట్రాల్లో ఈ సందడి కొనసాగనుంది. ఈ కారణంగానే కల్కి సినిమా మరోసారి పోస్ట్ పోన్ చేయనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందించే విషయం కూడా ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ సినిమా కేవలం 20 రోజులు మాత్రమే వాయిదా పడనుంది. అంటే మే 29 న ఈ సినిమాను విడుదల చేయనున్నారట మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.