మొదటి సారి పట్టుబడితే రూ.1000.. రెండోసారి రూ.2000 జరిమానా

మొదటి సారి పట్టుబడితే రూ.1000.. రెండోసారి రూ.2000 జరిమానా

ఎలాంటి వాహనాలు అయినా సరే సౌండ్ పొల్యూషన్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్.  వాహనదారులు సౌండ్  పొల్యూషన్ చేస్తూ మొదటి సారి పట్టుబడితే రూ.1000..రెండోసారి పట్టుబడితే రూ.2000 జరిమానా విధిస్తామన్నారు బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర నేషనల్ రోడ్డు సేఫ్టీ మంత్ కార్యక్రమం నిర్వహించారు. రోడ్లపై సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైకులను సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కు పాల్పడుతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. WHO గైడ్ లైన్స్ ప్రకారం… 65 డిసిబుల్ సౌండ్ మించి పైన ఉంటే నోయిస్ పొల్యూషన్, 75 డిసిబుల్ ఉంటే హార్మ్ ఫుల్.. 120 పైన ఉంటే పెయిన్ ఫుల్ పొల్యుషన్ అవుతుందన్నారు.

2021లో జనవరి లో సౌండ్ పొల్యూషన్ కు సంబంధించి 1134 కేసులు నమోదు చేశామన్నారు. గతేడాది జనవరి లో 24 రోడ్డు మరణాలు జరగగా.. ఈ ఏడాది జనవరిలో 10 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. బైకులు కొనేటప్పుడు ఉన్న సైలెన్సర్లను తీసివేసి ఎక్కువ సౌండ్ ఉన్న సైలెన్సర్లను అమర్చుకోవడం వల్ల  సౌండ్ పొల్యూషన్ పెరుగుతుందన్నారు.

see more news

విషాదం.. అక్కసుతో పందెం ఎడ్లను చంపేశారు

‘మాస్టర్’ నిర్మాతకు అమెజాన్ కాసుల పంట

బీఆర్ కే భవన్ వద్ద ఉద్రిక్తత..