రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘చలో సెక్రటేరియట్’ పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మాలలు పెద్దఎత్తున తరలివెళ్లారు. విద్య, ఉద్యోగాల్లో రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా మాల ఐక్యవేదిక నాయకులు జక్కుల యాదగిరి ఆధ్వర్యంలో మాలలు సోమవారం హైదరాబాద్ కు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు న్యాయం చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
