మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పై దాడి ని ఖండిస్తున్నం : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పై దాడి ని ఖండిస్తున్నం : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
  •     మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
  •     దాడిని నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన

ట్యాంక్ బండ్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. దాడులు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన అనుచరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీపై దాడిని నిరసిస్తూ బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నిరసన వ్యక్తం చేసింది. 

అనంతరం బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లతో కలిసి చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి కానీ దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. రాజిరెడ్డి అనే వ్యక్తి పథకం ప్రకారం వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడికి కుట్ర పన్నారని ఆరోపించారు. దాడులు చేసుకోవడం సరి కాదని, వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, కోటేశ్వరరావు, కట్ట శ్రీనివాస్, బైండ్ల శ్రీనివాస్, ఆనంద్ రావు, శ్రీకాంత్, జయ కుమార్, బాలకృష్ణ, అనిల్ కుమార్, రాకేష్, లలిత, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.