
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాలల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం చేసిన రోస్టర్ పాయింట్ల కేటాయింపును తక్షణమే సవరించాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. అలాగే, మాలలకు విద్య, ఉద్యోగాల్లో న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ఈ సందర్భంగా శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రం అందజేశారు.
వీరి వినతిపై సానుకూలంగా స్పందించిన భట్టి, మాలలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భట్టిని కలిసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజేష్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కె.లలిత, రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు సుధాకర్, నాయకులు మన్నె సాయికుమార్ కె.సాగర్ తదితరులు ఉన్నారు.