డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్టార్ నటుడు అరెస్ట్..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్టార్ నటుడు అరెస్ట్..

మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ కొందరు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అయితే ఇటీవలే మలయాళ ప్రముఖ సినీ నటుడు బైజు సంతోష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ మోటార్ సైకిల్ ని డీకొట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు. 

పూర్తివివరాల్లోకి వెళితే నటుడు బైజు సంతోష్ అర్థరాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించి తిరువనంతపురంలోని వెల్లయంబాలంలో కారులో వెళుతూ అటునుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించి ఉండటంతో చిన్నపాటి గాయాలతో బయట పడ్డాడు. 

ALSO READ | మాజీ భార్య ఫిర్యాదు చేయడంతో ప్రముఖ నటుడు అరెస్ట్...

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నటుడు బైజు సంతోష్ ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతడి కారుని స్వాధీనంచేసుకుని ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివాటిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో కండిషన్ తో కూడిన బెయిల్ పై ఈరోజు (అక్టోబర్ 14) విడుదలయ్యాడు బైజు సంతోష్.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు నటుడు బైజు సంతోష్ ఇప్పటివరకూ దాదాపుగా 100కి పైగా చిత్రాల్లో నటించాడు. కెరీర్ ఆరంభంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడంతోపాటూ హీరోగా కూడా నటించాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.