
ప్రస్తుతం ఎస్.యు.అరుణ్‌కుమార్(S.U. Arun Kumar) డైరెక్షన్లో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన (Chiyaan62) అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ గతేడాది రిలీజ్ చేశారు.రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran) అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా..త్వరలో తెలుగు టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఎస్.జె.సూర్య, దుసరా విజయన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా సెట్ లోకి మలయాళ వెర్సటైల్ యాక్టర్ సిద్దికీ(Siddique) కీలక పాత్రలో నటించబోతున్నారు.ఈ విషయాన్ని మేకర్స్ అఫీసియల్గా అనౌన్స్ చేశారు.
మలయాళ నటుడు సిద్ధికీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు.ఇక ఆయన నటించిన తెలుగు సినిమాల విషయానికి వస్తే..అంతిమ తీర్పు, నా బంగారు తల్లి, అగ్ని నక్షత్రం వంటి చిత్రాల్లో మెప్పించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్,టీజర్ తో ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు సిద్ధికీ కూడా నటిస్తుండటం వీర ధీర శూరన్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
Excited to announce that we have with us another brilliant performer #siddique with us on board for #veeradheerasooran@chiyaan #Kaali #காளி
— HR Pictures (@hr_pictures) April 21, 2024
Veera Dheera Sooran
An #SUArunkumar Picture
A @gvprakash musical
@iam_SJSuryah #surajvenjaramoodu @officialdushara @thenieswar… pic.twitter.com/a2iUHm8KNy
విక్రమ్ 62 మూవీ ఏదో బలమైన కథాంశంతో సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో వీడియో అదిరిపోయింది. ఈ మూవీకి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
అలాగే విక్రమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ (Thangalaan) అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది.ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.