OTT Horror Thriller: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్.. రూ.30 కోట్ల బడ్జెట్, 150 కోట్ల కలెక్షన్స్!

OTT Horror Thriller: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్.. రూ.30 కోట్ల బడ్జెట్, 150 కోట్ల కలెక్షన్స్!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ప్రేమమ్’ హీరో నివిన్ పౌలీ మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్వం మాయ’తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘సర్వం మాయ’ సినిమా సుమారు రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ, లాంగ్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి సుమారు రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

ఈ అద్భుత విజయంతో అన్ని భాషల సినీఆడియన్స్ దృష్టి ఈ సినిమాపై పడింది. ప్రస్తుతం ఈ మూవీ జనవరి 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు భాషలోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. అఖిల్ సత్యన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నివిన్ పౌలీతో పాటు రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, రఘునాథ్ పలేరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇంతకీ ఈ హారర్ కామెడీ కథ ఏంటో ఓ లుక్కేయండి.

కథేంటంటే:

ప్రభేందు నంబూతిరి (నివిన్ పౌలీ) బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ దేవుడిని పెద్దగా నమ్మడు. గొప్ప గిటారిస్ట్ కావాలనేది అతని కల. ఆ ప్రయత్నాల్లో భాగంగానే స్టేజీ షోలు చేస్తుంటాడు. తండ్రితో విబేధాల వల్ల ఇంటికి దూరంగా ఉంటాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఒకసారి తిరిగి ఇంటికి వెళ్లాల్సివస్తుంది. ఆ టైంలో ఖాళీగా ఉండకుండా డబ్బు సంపాదించేందుకు తన బావ రూపేశ్​(అజు వర్గీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో కలిసి పూజలు, హోమాలు చేస్తుంటాడు.

ఒకసారి ఓ ఇంట్లో పూజలు చేసేందుకు వెళ్లినప్పుడు అతనికి ఆత్మ కనిపిస్తుంది. అది అతనితో  మాత్రమే మాట్లాడుతుంటుంది. సాధారణ దెయ్యాల్లా భయపెట్టదు. అతనికి అన్ని విషయాల్లో సాయం చేస్తుంటుంది. జాబ్ సంపాదించడం, లవ్ లైఫ్, మ్యూజిక్ కెరీర్ పట్ల ఫోకస్ చేసేలా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.